క్రైమ్/లీగల్

మానవ మృగాల బారిన చిరుత పులులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 14: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల్లో చిరుత పులులు మృత్యువాత పడుతున్నాయి. అనుకోని రీతిలో సంభవిస్తున్న ప్రమాదాలు సైతం వాటిని బలిగొంటున్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలోనే వేర్వేరు సంఘటనల్లో ఐదు చిరుత పులులు మృత్యువాతపడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప శివారులో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కుకుని మరో చిరుత ప్రాణాలు కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎంతో విలువైన చిరుత గోర్లు, దంతాల కోసమే చిరుత ప్రాణాలను స్మగ్లర్లు కబళించారు. ఈ సంఘటనకు సంబంధించి అటవీ, పోలీసు శాఖ అధికారులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మాక్లూర్ మండలం గుత్ప తండాకు చెందిన కేతావత్ రవి, ఎం.నరేందర్, ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్‌కు చెందిన వినయ్‌కుమార్, తులసీరాంలు చిరుతను వేటాడినట్లు నిర్ధారించుకున్న అటవీ శాఖ అధికారులు, వారిని మాక్లూర్ పోలీసులకు అప్పగించారు. రోజువారి విధుల్లో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గుత్పతండా శివారులోని అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా, సోమవారం ఉదయం చిరుత కళేబరం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దీంతో వారు తమ పైఅధికారులకు సమాచారం అందించగా, ఆర్మూర్ ఫారెస్ట్ డివిజన్ అధికారిణి అమృత, రేంజ్ ఆఫీసర్ రాములు హుటాహుటిన తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత గోర్లు, దంతాలు లేకపోవడాన్ని గమనించి, స్మగ్లర్లే చిరుతను వేటాడి ఉంటారన్న అనుమానంతో డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. దీంతో జాగిలాలు సంఘటనా స్థలానికి కొంత దూరంలో ఉన్న ఫామ్‌హౌస్ వద్దకు వెళ్లి అందులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న కేతావత్ రవిని పట్టించాయి. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, మిగతా నిందితులు నరేందర్, తులసీరాం, వినయ్‌కుమార్‌ల ప్రమేయం సైతం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుండి ఏడు చిరుత గోర్లు, నాలుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా చిరుత గోర్లు, దంతాలను తీసేందుకు ఉపయోగించిన గొడ్డళ్లు, కత్తులు, ఇతర మారణాయుధాలు కూడా వారి వద్ద లభ్యమయ్యాయి. మృతి చెందిన చిరుత వయస్సు 4నుండి 5సంవత్సరాల మధ్య ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. వెటర్నరీ వైద్యులను రప్పించి సంఘటనా స్థలంలోనే చిరుత కళేబరానికి పోస్టుమార్టం జరిపించారు. కొన్ని అవయవాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. చిరుతను మూడు రోజుల క్రితం వేటాడినట్లు అధికారుల విచారణలో నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. కాగా, ఈనెల 4వ తేదీన ఇదే మండలంలోని రాంచంద్రాపల్లి గ్రామ సమీపంలో ఓ రైతు తన పంటలకు రక్షణగా పొలానికి ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచెలో చిరుత కాలు చిక్కుకుని గంటల తరబడి నరకయాతన చివరికి తన కాలును వదిలించుకుని తీవ్ర గాయాలతో అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం శివారులో ఓ చిరుత అయితే ఏకంగా పక్షిని వేటాడేందుకు ఇరవై అడుగుల ఎత్తుతో ఉండే కరెంటు స్తంభం పైకి నిట్టనిలువునా ఎగబాకి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌తో మృతి చెందింది.
చిత్రాలు.. గుత్ప శివారులో లభ్యమైన చిరుతపులి కళేబరం, *నలుగురు నిందితులతో అధికారులు