క్రైమ్/లీగల్

పోలీసుస్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 14: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ బొమ్మూరు పోలీసుస్టేషన్ సోమవారం తెల్లవారుజామున గంజాయి కేసులో నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నడింపల్లి సీతారామరాజు కారులో గంజాయిని రవాణా చేస్తుండగా ఆదివారం రాత్రి బొమ్మూరు పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు 240కేజీల గంజాయిని వ్యాన్‌లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మరో కారులో వెనుక వస్తున్న సీతారామరాజుతో పాటు నెల్లూరు జిల్లా లక్ష్మీనరసింహపురంకు చెందిన షేక్ అహ్మద్ బాషా, నల్లజర్ల మండలం సింగరాయపాలెంనకు చెందిన సిహెచ్ రాంబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం బొమ్మూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. విచారణ సందర్భంగా పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తారని, తనకు జైలు శిక్ష ఖాయమన్న భయంతో పోలీసుస్టేషన్‌లోనే సీతారామరాజు సోమవారం తెల్లవారుజామున మరుగుదొడ్డికి వెళతానని చెప్పి వెళ్లాడు. అక్కడ ఉన్న ఇనుప రేకుతో కంఠం కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన సీతారామరాజును చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, 2014లో ప్రత్తిపాడు పోలీసుస్టేషన్ పరిధిలో ఒకసారి సీతారామరాజు గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడ్డాడు. ఈకేసులో అతను జీవితఖైదును విధించారు. జైలు నుంచి విడుదలైన సీతారామరాజు మరోసారి పోలీసులకు పట్టుబడటంతో ఈఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. స్వతహాగా ఆస్తిపరుడైన సీతారామరాజు అనంతర కాలంలో ఆస్తిని పోగొట్టుకుని, గంజాయి అక్రమ రవాణాను చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.