క్రైమ్/లీగల్

ఆ నియామకాన్ని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు నియామకాన్ని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈనెల 10 నాగేశ్వరరావును జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌గా నియమించారు. సీబీఐలో అదనపుడైరెక్టర్‌గా ఉన్న రావుకు తాత్కాలిక డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ అలోక్ కుమార్ వర్మకు ఉద్వాసన చెప్పిన సంగతి తెలిసిందే. అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు వర్మపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వర్మ స్థానంలో డిషనల్ డైరెక్టర్ నాగేశ్వరరావును కేంద్రం నియమించడం జరిగింది. నాగేశ్వరరావునియామకాన్ని రద్దుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని స్వచ్ఛంద సంస్థ ‘కామన్ కాజ్’, ఆర్‌టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగేశ్వరరావునియామకం పారదర్శకంగా సాగలేదని ఆమె ఆరోపించారు. ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి నియామక కమిటీ సిఫార్సు మేరకు తాత్కాలిక డైరెక్టర్ నియామకం జరగలేదని పిటిషనర్ తెలిపారు. కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి/ న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారని ఆమె అన్నారు. అయితే నాగేశ్వరరావునియామకం చట్టబద్ధంగా జరగలేదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్(డీఎస్‌పీఈ) చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 23న నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారని తరువాత సుప్రీం కోర్టు దాన్ని రద్దుచేసిందని ఆయన స్పష్టం చేశారు. తిరిగి అదే అధికారిని ఉన్నత పదవులోఎలా నియమిస్తారని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. డీఎస్‌పీఈ మార్గదర్శకాలను ప్రభుత్వం పట్టించుకోలేదని, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నియామకం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తెలిపారు.