క్రైమ్/లీగల్

సజ్జన్ కుమార్ అభ్యర్థనపై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: 1984 సిక్కు అల్లర్ల కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జన్ కుమార్ తనకు జీవితకాల శిక్ష విధించడంపై చేసిన అభ్యర్థనపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తనకు యావజ్జీవ కారాగారం విధించడాన్ని సవాల్ చేస్తూ సజ్జన్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ విషయంలో నాలుగు వారాల్లోగా తగిన వివరణ ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ‘సజ్జన్ కుమార్ అప్పీల్ పరిశీలనకు వచ్చింది. నిందితుని విజ్ఞప్తి మేరకు అతనికి బెయిల్ ఇవ్వడం లేదా జైలుశిక్షను రద్దు చేయడం అనేది ఆరు వారాల్లో నిర్ణయిస్తాం. దీనికి సంబంధించిన జవాబులేమైనా నాలుగు వారాల్లో మాకు సీబీఐ సమర్పించవచ్చు’ అని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కే.కౌల్‌తో కూడిన సుప్రీం బెంచ్ సూచించింది. 73 ఏళ్ల సజ్జన్ కుమార్ గత ఏడాది డిసెంబర్ 31న ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోయాడు. అతనికి ఢిల్లీ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సజ్జన్ కుమార్ రాజీనామా చేశారు.