క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జనవరి 16: మండలంలోని ఎస్ ఎంపురం గ్రామానికి చెందిన పడ్డ దీప (28) అనే వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకొంది. దీప స్వగ్రామం శ్రీకాకుళం రూరల్ మండలం బైరిసింగుపురం కాగా 2010లో ఎస్ ఎంపురం గ్రామానికి చెందిన పడ్డ గోవింద్‌తో వివాహం జరిగింది. గోవింద్ కళాసీగా జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటినుంచో కడుపునొప్పితో బాధపడుతున్న దీప వాటిని తట్టుకోలేక బుధవారం పురుగులు మందు తీసుకొని అపస్మారక స్థితిలో పడివుండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దీప మృతి చెందింది. మృతురాలుకు ఇద్దరు పిల్లలున్నారు. స్థానిక ఎస్సై ఎస్. కృష్ణ ఔట్‌పోస్ట్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.