క్రైమ్/లీగల్

తుపాకులతో బెదిరించి..గాలిలో కాల్పులు జరిపి.. దారి దోపిడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జనవరి 16: మద్యం వ్యాపారం ముగించుకొని డబ్బులతో ఇంటికి వెళ్తున్న ముగ్గురిని మార్గమధ్యంలో గుర్తుతెలియని నలుగురు దుండగులు తుపాకులతో బెదిరించి గాలిలో కాల్పులు జరిపి వారి నుండి రూ. 6.70లక్షలు అపహరించిన సంఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొడకండ్ల మండలం మోండ్రాయిలో ఓ మద్యం దుకాణంలో రాత్రి 10:30 గంటల వరకు మద్యాన్ని విక్రయించి సంబందించిన వ్యక్తులు తాళ్లపల్లి శేఖర్, శ్రీను, భాస్కర్‌లు ముగ్గురు ఒకే ద్విచక్ర వాహనంపై డబ్బులు పట్టుకొని పాలకుర్తి వెళ్లేందుకు బయల్దేరారు. మోండ్రాయి- రామన్నగూడెం గ్రామాల మధ్య కాపుకాసిన నలుగురు దుండగులు రోడ్డుకు అడ్డంగా తాడువేసి వారి ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. డబ్బులు పట్టుకొని వస్తున్న ఆ ముగ్గురు బయంతో కేకలు వేస్తుండగా దుండగులు వారి వద్ద ఉన్న తపంచలతో గాలిలో కాల్పులు జరిపారు. మీ దగ్గర ఉన్న డబ్బుల బ్యాగు ఇవ్వని పక్షంలో చంపివేస్తామని బెదిరించడంతో వారు ఆ బ్యాగును ఆ దుండగులకు ఇచ్చేశారు. ఈ విషయాన్ని గ్రామానికి వెళ్ళి తమ దుకాణం యజమానికి వివరించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. వరంగల్ సీపీ రవీందర్, వెస్ట్‌జోన్ పోలీసు కమీషనర్ శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ మధుసూధన్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలను పాలకుర్తి సీఐ బానోతు రమేష్‌నాయక్, కొడకండ్ల ఎస్సై రాజులను అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా వరంగల్ సీపీ రవీందర్ మాట్లాడుతూ నిందితులు మద్యం వ్యాపారులపై ఎప్పటినుండో నిఘా వేసి ఉన్నట్లు తెలుస్తుందని అన్నారు. అజాగ్రత్తగా రాత్రి డబ్బులను తీసుకుపోవడాన్ని వారు గ్రహించి ఉన్నారని అన్నారు. ఏది ఏమైనా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

చిత్రం..ఘటనా స్థలిలో వివరాలు సేకరిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్