క్రైమ్/లీగల్

చేపల వేటకు వెళ్లి యువకుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంపలగూడెం, జనవరి 20: గంపలగూడెంకు చెందిన ఏసుబాబు (33) ఏటిలో చేపలు వేటాడడానికి ఆదివారం వెళ్లి ప్రమాదవశాత్తు ఏటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. చేపలకు విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా అవి చనిపోతే వాటిని పట్టుకుని కొంతమంది ఇటీవల అమ్మకం మొదలు పెట్టారు. దానిలో భాగంగా గుంజి బాబూరావుతో కలిసి ఏటిలో చేపలకు విద్యుదాఘాతం ఇవ్వడానికి కరెంటు వైరును విద్యుత్ స్తంభం ఎక్కి కనెక్షన్ ఇస్తుండగా ఏసుబాబు విద్యుదాఘాతానికి గురై ఏటిలో పడిపోయాడు. దాంతో బెంబేలెత్తిన సహచరుడు బాబూరావు ఏటిలో విలవిల్లాడుతున్న ఏసుబాబును ఒడ్డుకు తీసుకువచ్చాడు. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే తిరువూరు పోలీసులకు సమాచారం అందించాడు. తిరువూరు ఎస్‌ఐ మణికుమార్ మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

స్విఫ్ట్ కారులో మంటలు

మచిలీపట్నం, జనవరి 20: మచిలీపట్నంలో ఆదివారం రాత్రి ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించిన సంఘటన ప్రజలను భయాందోళనకు గురి చేసింది. చల్లపల్లి మండలం మాజేరు గ్రామానికి చెందిన తోట ఉదయ్‌కుమార్‌కు చెందిన మారుతి స్విఫ్ట్ కారును 7గంటల సమయంలో కోనేరుసెంటరులో రోడ్డుకు పక్కన పార్కింగ్ చేసి షాపింగ్‌కు వెళ్లాడు. కొద్ది నిమిషాల్లో ఆకస్మాత్తుగా కారు ఇంజన్ నుండి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు ఆఘమేఘాల మీద ఘటనా స్థలికి వచ్చి మంటలను అదుపు చేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. మంటలు వ్యాపించిన సమయంలో కారులో ఎవ్వరూ లేకపోవటం, అగ్నిమాపక అధికారులు తక్షణం స్పందించటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.