క్రైమ్/లీగల్

ఫిబ్రవరి నాటికి టీచర్ పోస్టులు భర్తీచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి చివరికల్లా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సాదుపాయాల కల్పనతోపాటు, ఉపాధ్యాయుల నియామకాల్లో జాప్యం జరుగుతోందని జేకే రాజు, వెంకటేశ్, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు సోమవారం న్యాయమూర్తులు ఏకే సిక్రీ, అబ్దుల్ నాజర్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ తరపు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ తెలంగాణలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను అభ్యర్థులకు అందజేయాల్సి ఉందని అన్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు మినహా మిగిలిన పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడువేల పోస్టులకు పరీక్షలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి చివరికల్లా నియామక ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఫిబ్రవరి చివరినాటికి రెండు రాష్ట్రాలు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. తెలంగాణ పేరెంట్ అసోసియేషన్ తరపున శ్రవణ్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వం తరపున ఉదయ్‌కుమార్ సాగర్, ఏపీ తరపున గుంటూరు ప్రభాకర్ కోర్టుకు హాజరయ్యారు.