క్రైమ్/లీగల్

మహానగరంలో మాయగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: మాయమాటలు చెబుతూ జనాన్ని మోసం చేస్తున్న ఇరానీ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ‘సమీపంలోని గుడిలో పూజులు చేస్తున్నాం. బంగారం షాపు పెడుతున్నాం. షాపు పెడుతున్నప్పడు పేదలకు డబ్బులు దానం చేయాలి. అయితే మాకు సమయం లేదు.. మీరే పంచండి‘అని ముఠా జనానికి ఆశచూపుతుంది. వెయ్యి రూపాయలు ఆశచూపించి మాయ మాటలతో మహిళ దృష్టిమలచి బంగారు ఆభరణాలను గ్యాంగ్ ఎత్తుకెళ్తుంది. గ్యాంగ్‌లోని ముగ్గురు ఘరానా దొంగలను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ. 11 లక్షల విలువ చేసే 32.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ముఠాలో ప్రధాన నిందితుడు 2017లో జైలు నుంచి విడుదలైన తరువాత గ్యాంగ్ ఏర్పాటు చేసి మూడు నెలల్లో 58 నేరాలకు పాల్పడినట్లు సీపీ వెల్లడించారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మహారాష్టల్రోని థానే జిల్లా కల్యాణ్‌కు చెందిన వాసీం అబ్బాస్ సిరాజ్ (34) మధ్యప్రదేశ్ రైల్వే జబల్‌పూర్ వాసి జై కుమార్ రజాక్ (37) రాజస్తాన్‌కు చెందిన మహ్మద్ ఖాన్ (44) ముంబయికి చెందిన జావెద్ బాలి ( పరారీ) వేరు వేరు కేసుల్లో జైలుకి వెళ్లారు. ముంబయిలోని తలొజా కారాగారంలో వీరికి పరిచయం ఏర్పడింది. గత ఎడాది నవంబర్ 22న జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తనకు డబ్బు అవసరం ఉందని గ్యాంగ్ లీడర్ వాసీంకు రజాక్ చెప్పాడు.
హైదరాబాద్‌లో మహిళలు బంగారం ఎక్కువ ధరిస్తారని వారికి భక్తి ఎక్కువని అక్కడకు వెళ్తే కావల్సిన సొమ్ము సులువుగా సంపాదించవచ్చని చెప్పడంతో ఇద్దరు గత ఏడాది ఇక్కడకు వచ్చారు. నగరంలోని పలు ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి వెళ్లారు. సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఆరుగురు మహిళలను దృష్టి మళ్లించి పుస్తెల తాళ్లు, చేతి ఉంగరాలు చోరీ చేసినట్లు సీపీ వివరించారు. షాపులోను ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని పూజలు, వ్రతాలు పేరుతో దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడతారని సజ్జనార్ తెలిపారు. కిరాణ జనరల్ షాపుకి వెళ్లి సమీపంలో ఉన్న దేవాలయంలో పూజలు చేస్తున్నట్లు పరిచయం చేసుకుని కొబ్బరికాయ కావాలని అడుగుతారు. కొబ్బరికాయ డబ్బులు చెల్లించిన అనంతరం వెయ్యి రూపాయలు ఇచ్చి ఎవరైనా పేదలు ఉంటే దానం చేయమని చెబుతారు. తన వద్ద ఉన్న 500 రూపాయలు తీసి దేవుడి దగ్గర నుండి తీసుకొచ్చాను మీవద్ద ఉన్న బంగారం తీసి డబ్బులకు అద్దమని అంటారు. సదరు మహిళ చేతికి ఉన్న ఉంగరం చూపిస్తే కాదు బరువు ఎక్కువ ఉండాలని మాయ మాటలతో మెడలోని పుస్తెల తాడు తీయమని నమ్మిస్తారు. పుస్తెల తాడును వారి ముందే దేవుడి దగ్గర నుండి తెచ్చిన 500 రూపాయల నోటులో వేసి మూటకట్టి కొంతసేపు అయిన తరువాత చూడాలని అలాచేస్తే ఇంట్లో మంచి జరగడంతో పాటు సమస్యలు పోయి కొంత కాలంలోనే రెట్టింపు డబ్బు సంపాదన కలుగుతుందని మోసం చేసి మాయమవుతారు. నిందితులు గడచిన మూడు నెలల్లో పలు రాష్ట్రాల్లో 58 నేరాలు చేసినట్లు సీపీ వెల్లడించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో వందల కేసు ఉన్నాయని జైలు నుండి విడుదలైన మూడు నెలల్లో 58 నేరాలు చేసినట్లు సీపీ వివరించారు. ఈముఠా తెలంగాణలో మొదటిసారి ఈ తరహా దోపిడీకి పాల్పడినట్లు తెలిపారు. దేశంలో ఇరానీ గ్యాంగ్‌లు 39 ఉన్నట్లు చెప్పిన సీపీ నిత్యం కొత్త తరహలో నేరాలు చేస్తుంటారని చెప్పారు. జైకుమార్‌ని, మహ్మద్ ఖాన్‌లను వారం క్రితమే అరెస్టు చేసి రిమాండ్ చేయడంతో పాటు పీడీ యాక్టు కూడా పెట్టినటు సజ్జన్నార్ చెప్పారు. కేసు దర్యాపు చేసి నిందితులను అరెస్టు చేసిన ఎస్‌ఓటీ పోలీసులను అభినందించారు. ఈకార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్‌ఓటీఏ డీసీపీ దయానంద్ రెడ్డి, ఏసీపీ శ్యామ్‌బాబు, సీఐ పురుషోత్తంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
చిత్రం..ఎలా మోసపోయందీ చెబుతున్న మహిళలు