క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జనవరి 22 : గుంతకల్లు రైల్వేస్టేషన్‌లోని 4వ ప్లాట్‌ఫారంలో మంగళవారం రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మహారాష్టల్రోని డోండ్‌కు చెందిన ఆనంద్ కందారి (35) వాస్కోడిగామా-హౌరా వెళ్లే 18048 రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కార్మికుడి మృతి
మడకశిర, జనవరి 22 : మండలంలోని క్యాంపురానికి చెందిన రామదాస్ (65) భవనం పైనుంచి పడి మృతి చెందాడు. క్యాంపురానికి చెందిన రామదాస్ బుళ్లసముద్రంలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.