క్రైమ్/లీగల్

పత్రికా ప్రకటనతో మోసపోయిన ఎర్రగుడిపాడు వాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, జనవరి 22: శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన ఏడుగురు ఓ ప్రముఖ దినపత్రికలోని ప్రకటనలు చూసి నగదు చెల్లించి మోసపోయామని మంగళవారం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మోసపోయిన వైనాన్ని పోలీసులకు వివరించి తాము కోల్పోయిన నగదును ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణయ్య మాట్లాడుతూ పత్రికలు, టీవీల్లో వస్తున్న మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోవద్దని ఎర్రగుడిపాడు వాసులకు తెలిపారు. రూరల్ మండలంలోని ఎర్రగుడిపాడుకు చెందిన శంకర్‌రెడ్డి, వెంకట్రామయ్య, ప్రకాష్, గంగారావ్, సుబ్బరామయ్య, మల్లికార్జున్‌లు తక్కువ వడ్డీకి లక్ష రూపాయలు రుణంగా ఇస్తామని ప్రకటన ఇచ్చారు. ప్రకటనను చూసి అందులోని ఫోన్‌నెంబర్‌తో మాట్లాడామని చెప్పారు. అప్పుడు తాము భద్రాచలంలో ఉన్నామని, తాము నేరుగా కలిసేందుకు వీలుగా కాదని, లక్ష రూపాయలు రుణం కావాల్సిన వారందరూ ఒక్కొక్కరు 10 వేల రూపాయలు చొప్పున తమ ఖాతాల్లో జమ చేస్తే వెంటనే లక్ష రూపాయలు రుణం మంజూరు చేస్తామని వారు హామీ ఇచ్చారన్నారు. ఈ హామీని నమ్మిన ఏడుగురు ఒక్కొక్కరు పదివేల రూపాయల వంతున 70వేల రూపాయలను పత్రికా ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా వారి ఖాతాల్లో జమ చేశారు. రెండవరోజు తాము 10వేల రూపాయలు వంతున వేశామని, లక్ష రూపాయల లెక్కన రుణం ఇప్పించాలని కోరడానికి ప్రయత్నించగా, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేశారని, ఐదారు రోజులుగా ప్రయత్నించామని ఎర్రగుడిపాడు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక ప్రకాష్ అనే వ్యక్తి తమను సంప్రదించి న్యాయం చేయాలని కోరారని డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. ఆయనతో పాటు ఎస్‌ఐ వీరేష్ కూడా ఉన్నారు. ఎర్రగుడిపాడు వాసులు మోసపోయిన నగదును తిరిగి ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.