క్రైమ్/లీగల్

ప్రమాదానికి కారకుడైన వ్యాన్ డ్రైవర్‌కు రెండేళ్లు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరి, జనవరి 22: కాలి నడకన వెళుతున్న లలిత (32) అనే మహిళను వ్యాన్‌తో ఢీకొట్టి ఆమె మరణానికి కారణమైన డ్రైవర్ మణిగండన్‌కు జూనియర్ సివిల్ జడ్జి దుర్గా కల్యాణి రెండు సంవత్సరాలు జైలు, రూ. 10వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు. వ్యాను యజమానికి మూడు నెలలు జైలు, రూ. 1000 జరిమానా విధించారు. సీఐ మల్లికార్జున రావు కధనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గతేడాది మే 12వ తేదీన లలిత అనే మహిళ స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం నడకకు వెళ్లింది. ఈ సందర్భంగా వ్యాన్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మణిగండన్ తన వాహనాన్ని డిగ్రీ కళాశాల మైదానానికి తీసుకువెళ్లాడు. ఈక్రమంలో లలితను ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. దీంతో మణిగండన్‌పై ఎస్‌ఐ మునస్వామికి ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన కేసు నమోదు చేశారు. సుమారు 8 నెలలపాటు న్యాయస్థానంలో కేసు నడిచింది. ఇరువైపులా వాదోపవాదాలు విన్న జూనియర్ సివిల్ జడ్జి దుర్గా కల్యాణి, లలిత మృతికి డ్రైవర్ కారణమని తేల్చి శిక్ష విధించారు. వాహనం నడపడం తెలియని వ్యక్తికి వ్యానును ఇచ్చిన యజమానికి కూడా మూడు నెలలు జైలు శిక్ష విధించారు.