క్రైమ్/లీగల్

ఫింగర్ ప్రింట్ ఆధారంగా నేరస్తులను పట్టుకున్న రక్షక సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 22: తిరుపతి పోలీస్ శాఖలో ఒక విభాగమైన రక్షక విభాగం సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇద్దరు పాత నేరస్తులు పట్టుబడ్డారు. రక్షక ఇన్‌చార్జ్ ఏఎస్‌ఐ సి.గోపాల్‌రెడ్డి, కానిస్టేబుల్ ఎన్.అభినందన్ రెడ్డి, ఎ.లోకేష్‌కుమార్ రెడ్డి, వెంకటరెడ్డిలు ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఒక వ్యక్తిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతని వేలిముద్రలు తీసుకున్నారు. ఇతను ఒక కేసులో నేరస్తుడని తేలింది. తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ముద్దాయి అని కూడా తేలింది. పట్టుబడ్డవ్యక్తి తిరుపతికి చెందిన కురి మోహన్‌కృష్ణ అలియాస్ నానిగా గుర్తించి ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. అదేవిధంగా ఈనెల 19న స్థానిక సప్తగిరికాలనీ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న రక్షక-3 ఇన్‌చార్జ్ హెడ్‌కానిస్టేబుల్ ఎన్‌వీ కృష్ణమూర్తి, కానిస్టేబుళ్లు ఎన్.శేఖర్, విక్రమ్, ఎం.వీ కిరణ్‌లు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతని వేలిముద్రలు పరిశీలించడంతో నేరస్తుడని తేలింది. ఆరు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు గుర్తించారు. తిరుపతి 18వ వార్డు సప్తగిరి కాలనీకి చెందిన పి.తిలక్ (30)గా ముద్దాయిని గుర్తించారు. వెంటనే అతడిని అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. నేరస్తులను పట్టుకోవడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన రక్షక టీంకు క్యాష్ అవార్డు ఇవ్వాలని కమాండ్ కంట్రోల్ ఇన్‌చార్జ్ వెంకటప్పను ఎస్పీ అన్బురాజన్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రక్షక-1, రక్షక-3 టీం సిబ్బందికి క్యాష్ అవార్డులు అందించారు.