క్రైమ్/లీగల్
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిలిపేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ (క్రైం), జనవరి 22: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి, దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మలతోపాటు కేంద్ర సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేయాలని మంగళవారం ఆదేశాలిచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది.
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వైసీపీకి చెందిన నిర్మాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమా తీస్తూ తమ పార్టీని అప్రదిష్టపాలు చేస్తున్న తీరుపై హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ పిల్‌ను కోర్టు విచారణకు స్వీకరించిందని, వెంటనే వారిద్దరికీ నోటీసులు జారీ చేశారని, వీరితోపాటు కేంద్ర సెన్సార్ బోర్డుకు కూడా నోటీసులిచ్చిందని చెప్పారు.