క్రైమ్/లీగల్

విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ మీదకు దూసికెళ్లిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జనవరి 24: విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ మీదకు లారీ దూసికెళ్లడంతో ట్రాన్స్‌పార్మర్ ఎగిరి తుప్పలలోకి పడగా విద్యుత్‌స్ధంభం విరిగిన సంఘటన గజపతినగరంలో చోటుచేసుకున్నది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెదమానాపురం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న లోడు లారీ తెల్లవారజామున నాలుగు గంటల సమయంలో గజపతినగరం జాతీయ రహదారి పక్కన గల విద్యుత్ ట్రాన్స్‌పార్మర్‌ను బలంగా ఢీకొనడంతో ట్రాన్స్‌పార్మర్ పక్కన గల తుప్పలలోకి పడగా ఇంకా ముందుబాగాన రాళ్లుపైకి వెళ్లి ఎదురుగా ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొనడంతో విరిగిలారీ మీద పడింది. ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో పెద్దప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. స్ధంభాన్ని ఢీకొన్న వెంటనే గజపతినగరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గల బ్రేకర్‌కు ట్రిప్పుకావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లారీలో గల డ్రైవర్, క్లీనర్‌లకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. బ్రేకర్‌కు ట్రిప్పు పడకపోతే ఘోర ప్రమాదం జరిగేదని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. లారీ బ్రేకులు పెయిల్ కావడంతో లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి జాతీయ రహదారి పక్కన గల విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ ఢీకొని వెంటనే రాళ్లకుప్పల మీదకి తీసుకెళ్లడంతో లారీ ఆగింది. దీంతో విద్యుత్ సరపరాకు సుమారు రెండు గంటల పాటు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదం కారణంగా విద్యుత్‌శాఖకు రెండు లక్షల 38వేల 947 రూపాయలు నష్టం వాటిల్లిందని గజపతినగరం విద్యుత్‌శాఖ ఎ ఇ పిచ్చయ్య గజపతినగరం పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.