క్రైమ్/లీగల్

రూ. 6 కోట్లు హాంఫట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జనవరి 24: స్నేహితులు, బంధువుల వద్ద అప్పు చేసిన ఓ వ్యక్తి రూ.6 కోట్లు హాంఫట్ అని చేతులెత్తేయడంతో విషయం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరింది. పోలీసుల వివరాల ప్రకారం రామవరప్పాడుకు చెందిన సీహెచ్ శ్రీనివాసరావు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే వ్యాపార అవసరాల కోసం కాల్‌మనీ కోరల్లో చిక్కుకున్నాడు. వడ్డీలకు తెచ్చిన సొమ్మును వడ్డీలకే చెల్లించడంతో సుమారు రూ. 6 కోట్లు అప్పులు తేలాయి. దాంతో బాకీ దారులందరికీ మొండి చేయ్యి చూపించాడు. కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలోని ఓ బంగారు నగల వ్యాపారికి అధిక మొత్తం ఇవ్వాల్సి ఉండగా ఆ వ్యాపారి విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ని ఆశ్రయించాడు. కమిషనర్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు నిందితుడిని పిలిపించారు. గురువారం జరిగిన ఈ సంఘటనలో శ్రీనివాసరావు రామవరప్పాడుకు చెందిన మరో 24 మందికి కూడా నగదు ఎగవేశాడని తేలింది. సమాచారం అందిన బాధితులందరూ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ఎవరికి ఎంతెంత ఇవ్వాలో లిస్టు తయారు చేయమని పోలీసులు సూచించారు. కాగా శ్రీనివాసరావు తెలంగాణాలో అతని భార్య పేరున పొలం కొన్నాడని అతను నష్టపోలేదని బాధితులు పోలీసులకు వివరించారు. నిందితుడు మాత్రం కాల్‌మనీ కోరల్లో చిక్కొని అప్పులపాలయ్యానని పోలీసులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. బాధితుల్లో 24 మంది రామవరప్పాడు ప్రాంతం వారే కావడంతో కేసును ఆ ప్రాంతానికి చెందిన పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయాలనే ఆలోచనలో వన్‌టౌన్ పోలీసులున్నారు.