క్రైమ్/లీగల్

ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్ నేతల పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, దాసోజు శ్రవణ్ పిటిషన్లు దాఖలు చేశారు. కొడంగల్ నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కొడంగల్‌లో చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే తాను ఘన విజయం సాధిస్తానని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు. అలాగే అనేక అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. కొడంగల్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటున్న నరేందర్‌రెడ్డి వద్ద రూ 17.50 కోట్ల రూపాయలు ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. భారీగా నగదు పట్టుబడినప్పటికీ నరేందర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. కొండంగల్ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి కోట్లాది రూపాయలు చెల్లించారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల పోలీస్ సూపరింటెండ్‌ట్‌లకు లక్షలాది రూపాలు ఎరేశారని ఆయన అన్నారు. కానిస్టేబుల్, హోంగార్డుల మొదులుకుని ప్రతి పోలీస్ ఉద్యోగికి డబ్బులు పంపిణీ చేశారన్నారు. ఎన్నికల సందర్భంలో కొన్ని మీడియా సంస్థలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేశాయంటూ, వాటికి సంబంధించిన క్లిప్పింగ్‌లు కోర్టుకు సమర్పించారు. తనపట్ల తప్పుడు చెడుగా కథనాలు ప్రచారం చేశాయన్నారు. తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషన్‌లో ఆరోపించారు. కాగా గద్వాల, ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలుగా పోటీ చేసిన డీకే అరుణ, దాసోజ్ శ్రావణ్ కూడా తమ నియోజక వర్గాల్లో ఎన్నికల అక్రమాలు జరిగాయని కోర్టును ఆశ్రయించారు.