క్రైమ్/లీగల్

29 నుంచి అయోధ్య కేసు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: అయోధ్య రామజన్మభూమి వివాదం కేసును విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు. ఈ కేసును ఈ నెల 29వ తేదీ నుంచి ధర్మాసనం విచారిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ఈ కేసు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ కేసు విచారణకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్యాణ్ సింగ్ తరఫున తాను ఈ కేసులో వాదనలు వినిపించినందుకు అయోధ్య కేసు విచారణ ధర్మాసనం నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ లలిత్ పేర్కొన్న విషయం విదితమే. కొత్తగా ఏర్పాటు చేసిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డో, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఎ నజీర్, జస్టిస్ ఎన్‌వీ రమణ ఉన్నారు. కొత్త ధర్మాసనం ఏర్పాటు చేసినట్లు ఈ నెల 29 నుంచి విచారణ ప్రారంభమవుతుందని కోర్టు రిజిస్ట్రీలో నమోదైంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో పార్టీలకు ఈ సమాచారం తెలియచేయాలని ఆదేశించారు. అలహాబాద్ హైకోర్టు 2010లో అయోధ్య కేసుపై తీర్పును వెలువరించింది. కాని దీనిని సవాలు చేస్తూ అనేక మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని నాలుగు సంస్థలకు కేటాయిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.