క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్‌జంక్షన్, జనవరి 25: బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాజమండ్రి నుంచి విజయవాడ వెళుతున్న ఇన్నోవా అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు తెలిపిన వివరాల ప్రకారం. తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామానికి చెందిన బుద్ధి వెంకటేశ్వరరావు (డ్రైవర్), అతని స్నేహితుడు బొడ్డు రాంబాబు ఇన్నోవా వాహనంలో విజయవాడకు గురువారం రాత్రి బయలుదేరారు. మార్గమాధ్యంలోని రావులపాలెం బస్టాండ్ వద్ద గుంతక్ సంఘమేశ్వర్, శ్రీనివాసరావు, రమణరావు, జాషువ ఇన్‌స్టీన్ విజయవాడ వెళ్ళేందుకు ఇన్నోవాలో ఎక్కారు. వాహనం హనుమాన్ జంక్షన్ కూడలి దాటిన తర్వాత కోడూరుపాడు మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను దాటి విజయవాడ నుంచి ఏలూరు వైపువెళుతున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇన్నోవాను నడుపుతున్న వెంకటేశ్వరరావు(25), అతని స్నేహితుడు రాంబాబు (22) బాన్సువాడకు చెందిన సంఘమేశ్వర్ అక్కడిక్కడే మృతి చెందారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు శ్రీనివాసరావు (విజయవాడ) రమణరావు (రావులపాలెం) జాషువా ఐన్‌స్టీన్ (గుంటూరు) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు వీరవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విజయవాడ అసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని హనుమాన్‌జంక్షన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ పరిశీలించారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిద్రమత్తులో వుండడం వలనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. మృతి చెందిన వెంకటేశ్వరావు ఇన్నోవాను విజయవాడలో అప్పగించేందుకు వెళ్ళుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.