క్రైమ్/లీగల్

అమాయకులపై సైబర్ నేరగాళ్ల వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, జనవరి 27: అమాయక ప్రజలపై సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. పలు బహుమతుల పేరుతో ఆశ చూపించి రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ క్షణాల్లో మోసాలకు పాల్పడతున్నారు. మూడు నెలల వ్యవధిలో సైబర్ నేరగాళ్ల వలలో లక్షల్లో మోసపోయామని నగర సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు లందాయ. హైదారాబాద్, బెంగళూరు, చెనె్న నగరాలను లక్ష్యంగా నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా వాహనాలు అవసరంగా మారిన నేపథ్యంలో నేరస్థులు మోసాలకు తెరలేపారని అధికారులు చెబుతున్నారు. వాహనాలు బహుమతిగా ఇస్తామంటూ నేరాలకు పాల్పడుతున్నారు. పలు ప్రవేటు సంస్థల నుంచి ఫోన్ నెంబర్లు సేకరిస్తూ వారికి ఫోన్ చేసి లక్కీ డిప్‌లో బహుమతులు వచ్చిందని నమ్మిస్తున్నారు. నిర్ణీత రుసుం చెల్లించి తొలుత చెల్లించి రిజిస్ట్రేషన్, బీమా, కస్టమ్స్ ఖర్చులని నమ్మించి డబ్బులను తమ ఖాతాలో జమ చేయించుకుంటున్నారు. సైబర్ నేరస్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.