క్రైమ్/లీగల్

ఘరానా గజదొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 28: ఇంటికి తాళం వేసి కనపడితే ఆ ఇల్లు గుల్ల కావలసిందే. పగలు చూస్తాడు రాత్రి పని కానిచ్చేస్తాడు. తెలంగాణలో 47, ఏపీలో 16 దొంగతనాలు చేసిన ఘరానా గజదొంగను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
రెండు తెలుగు రాష్ట్ర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అంతర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసి రూ.75 లక్షల విలవ చేసే బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగత్ వివరించారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీపీ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడి మండలం చిన్నమాలపల్లికి చెందిన వేముల నటరాజు (43) వృత్తి ఆటోడ్రైవర్, ఆయుర్వేదం మందుల విక్రయం. ప్రవృత్తి దొంగతనాలు చేస్తాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 విష్ఠ హాస్పటల్ సమీపంలో నివాసముంటూ ఆయుర్వేదం మందుల వ్యాపారం చేస్తున్నాడు. పగలు మందులు విక్రయించే వాడిలా తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను పరిశీలిస్తాడు. రాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి ఉన్నదంతా దోచుకుపోతాడు. మల్కాజ్‌గిరి జోన్‌లోని కూషాయిగూడ డివిజన్‌లో 24, జవహర్‌నగర్ 13, కీసరలో 10 దొంగతనాలు చేసినట్లు సీపీ చెప్పారు. 47 కేసుల్లో 32 భారీ దొంగతనాలు ఉన్నట్లు సీపీ వివరించారు. 2005 నుండి దొంగతనాలు చేయడం మొదలుపెట్టిన నటరాజు పశ్చిమగోదావరిలో పలు ప్రాంతాల్లో 16 కేసుల్లో నిందితుడని తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కామవరపుకోటకు చెందిన రాజశేఖర్, మెదక్ జిల్లా తుప్రాన్‌కు చెందిన వడ్ల కృష్ణమాచారీ, నరేష్‌చారీలను కూడా అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. రాజశేఖర్, కృష్ణమాచారీ, నరేష్ నటరాజు దొంగిలించిన సొత్తును తీసుకుని బయట విక్రయించేవారని మహేష్ భగత్ చెప్పారు. వీరితో పాటు మరో ముగ్గురు రిసీవర్స్ పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో అరెస్టు చేయనున్నట్లు సీపీ తెలిపారు. మల్కాజ్‌గిరి జోన్ పరిధిలో తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. నటరాజు ఒంటరిగానే వెళ్లి దొంగతనాలు చేస్తాడని, దొంగిలించిన సొత్తును నరేష్, కృష్ణమాచారి, రాజశేఖర్‌ల ద్వారా విక్రయిస్తాడని తెలిపారు. నటరాజు, రాజశేఖర్ పశ్చిమగోదావరిలో కూడా పలు దొంగతనాలు చేసి అరెస్టు ఆయ్యారని అదే స్నేహంతో నగరానికి వచ్చి నందినగర్‌లో నివాసముంటున్నాడని వివరించారు. నటరాజుతో పాటు రిసీవర్స్ రాజశేఖర్, కృష్టమాచారి, నరేష్‌లను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల నుండి రూ. 75లక్షల విలువ చేసే 2కేజీల 100 గ్రాముల బంగారం, ఏడున్నర కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.