క్రైమ్/లీగల్

రెండు ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, జనవరి 30: రెండు ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఢీకొన్న సంఘటన బుధవారం మండల పరిధిలోని కిషన్‌నగర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రెండు పాఠశాలలకు చెందిన బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో బస్సులలోని విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మండల పరిధిలోని కిషన్‌నగర్ గ్రామ శివారులో మేధా ఇంటర్నేషనల్ స్కూల్, మరో ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో బస్సులకు బ్రేకులు పడకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ పేర్కొన్నారు. కాలం చెల్లిన బస్సులు వాడటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి బస్సులో విద్యార్థులను ఎక్కించువడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల యాజమాన్యాలు బస్సుల కండిషన్లను ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలని, ఈ విషయంలో సంబంధిత ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకొని స్కూల్ బస్సులను సీజ్ చేసి విద్యార్థుల ప్రాణాలను రక్షించాలని తల్లిదండ్రులు కోరారు.