క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జనవరి 30: కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని సీవీఆర్ వంతెన వద్ద రైలుపట్టాల పక్కన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. బుధవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటనలో అనుమానితుడు హతురాలి చిన్న అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వించిపేట ఫోర్‌మెన్ బంగళా ప్రాంతంలోని రెహమాన్ వీధిలో నివాసముంటున్న ఇస్మాయిల్(46), కరీమా(44) దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ సంతానం. ఆడపిల్లలకు వివాహాలు అయ్యాయి. ఇస్మాయిల్ తాపీపని చేస్తుండగా కరీమా పాచిపనులు చేసుకుంటూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. పెద్దల్లుడు దివ్యాంగుడు కావడంతో అతను, కూతురు ఇస్మాయిల్ ఇంట్లోనే ఉంటున్నారు. చిన్నల్లుడు టిప్పుసుల్తాన్ అలియాస్ టిప్పు తన భార్యతో వేరుగా ఉంటున్నాడు. అయితే మంగళవారం సాయంత్రం పెద్దల్లుడికి తోపుడు బండిని జలీల్ ఖాన్ వద్ద ఇప్పిస్తానని, పింఛన్ విషయం కూడా మాట్లాడాలని టిప్పు తన తోడల్లుడి సెల్‌కి ఫోన్ చేసి అత్తను బయటకు రమ్మన్నాడు. దివ్యాంగునికి మంచి జరుగుతుందనే ఆనందంతో ఇంటి నుండి బయటకు వెళ్లిన కరీమా బుధవారం రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించింది. బుధవారం ఉదయం ఇస్మాయిల్ తన భార్య అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి రాగా పోలీసులు మృతదేహం వద్దకు తీసుకెళ్లగా తన భార్యగా గుర్తించాడు. అల్లుడు టిప్పుసుల్తాన్ తన భార్యను హతమార్చి ఉంటాడనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్యను అల్లుడు ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లడం తన చిన్నకూతురు చూసిందని తెలిపాడు. మంగళవారం నుండి కరీమా, టిప్పుసుల్తాన్ అదృశ్యం కావడం, టిప్పుసుల్తాన్ సెల్‌ఫోన్‌ను స్విచ్చ్ఫా చేయడంతో అతనిపై అనుమానమని ఇస్మాయిల్ తేల్చడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలాన్ని అదనపు డీసీపీ నవాజ్ జానీ, వెస్ట్ జోన్ ఏసీపీ కే సుధాకర్, కొత్తపేట సీఐ ఎండీ ఉమర్ పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం గంట వ్యవధిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన పంథాలో విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం టిప్పుకి పెళ్లికి ముందే ఓ యువతితో ప్రేమాయణం సాగింది. ఈ విషయం గ్రహించిన భార్య పలుమార్లు అతనితో గొడవ పడింది. ఇంకా పాత పరిచయాలను వదలడం లేదని, తనతో సరిగ్గా ఉండడంలేదని టిప్పు భార్య తన తల్లి కరీమాకి చెప్పింది. అప్పటి నుండి అత్తా, అల్లుడి మధ్య గొడవలు జరిగాయి. కరీమా పలుమార్లు అల్లునిపై చేయిచేసుకుంది. అందరిముందు అవమానించింది. దాంతో కక్ష పెంచుకున్న టిప్పు పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్య కేసులో ఆటో ఎవరిది, హత్యా స్థలానికి ఎలా వెళ్లారు, హత్యకు సహకరించిన వారెందరు వంటి వివరాలు రాబడుతున్న పోలీసులు గురువారం నాటికి వివరాలు వెల్లడించనున్నారు.