క్రైమ్/లీగల్

వెయ్యి కాళ్ళ మండపం పునర్నిర్మాణంపై హైకోర్టులో ఎమ్మెల్యే రోజా పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 30: తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం పునర్నిర్మాణంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్థలం అందుబాటులో లేదన్న కారణంతో వెయ్యి కాళ్ళ మండపాన్ని వేరే చోటుకు మార్చే ప్రయత్నం జరుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వెయ్యి కాళ్ళ మండపాన్ని వేరే చోటుకు మారిస్తే భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని అన్నారు.
వెయ్యి కాళ్ళ మండపం పునర్మిర్మాణం భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశమని, ఇప్పటికే దీనికి సంబంధించి తాను టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళానని, తన విజ్ఞప్తులపై స్పందించకపోవడంతోపాటు మండపం నిర్మాణంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా రోజా పిటిషన్‌పై సమాధానం ఇవ్వడానికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వానికి వారంరోజులు సమయం ఇస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.