క్రైమ్/లీగల్

ఓటుకు నోటు కేసులో వేం నరేందర్‌రెడ్డికి ఈడీ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం నాడు గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్ళి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో వేం నరేందర్‌రెడ్డి తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. టీడీపీ నుంచి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఆయనతో పాటు వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరపైకి రావడంతో ఏమి జరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.