క్రైమ్/లీగల్

క్రికెట్ బుకీలపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ: తూర్పుగోదావరి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ ముఠాను జిల్లా పోలీసులు అరెస్టుచేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అరెస్టుచేసి, వారి నుండి రూ.11 లక్షలకు పైగా నగదు, సెల్‌ఫోన్లు, ఇతర సామాగ్రి తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని కాకినాడలోని తన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నాం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఎస్పీ విశాల్ గున్ని వాట్సాప్‌కు సుమారు 10 నెలల క్రితం క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందింది. ఈసమాచారాన్ని ఆయన రాష్ట్ర డీజీపీకి తెలియజేశారు. డీజీపీ ఆదేశాలతో ఎస్పీ కాకినాడ లా అండ్ ఆర్డర్ డీఎస్పీ రవివర్మ, కాకినాడ సీసీఎస్ డీఎస్పీ పల్లపురాజుల సారధ్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. శనివారం మధ్యాహ్నాం సుమారు 2.30గంటల సమయంలో ఎస్పీ విశాల్ గున్నికి బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందింది. ఆయన వెంటనే అప్రమత్తమై ఆదేశాలు జారీచేయడంతో డిఎస్పీలు రవివర్మ, పల్లపురాజు, కాకినాడ త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు ప్రత్యేక బృందాలతో కాకినాడ నగరం సూర్యనారాయణపురంలో చీకట్ల ఈశ్వరరావు అనే వ్యక్తి నివాసంపై దాడిచేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఈశ్వరరావు, అతనికి సహకరిస్తున్న ఆత్మూరి శివనాగవెంకటేశ్వర గుప్తను పోలీసులు అరెస్టుచేశారు. వారి నుండి క్రికెట్ బెట్టింగ్‌కు ఉపయోగించే ప్రత్యేక లైన్‌బాక్స్, ఒక ల్యాప్‌టాప్, ప్రింటర్, ఎల్‌ఈడీ టీవి, క్రికెట్ బెట్టింగ్‌కు వినియోగిస్తున్న రూ.1.71 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో కాకినాడ రెవెన్యూకాలనీ, సాయిబాబా గుడి వీధిలో ఉన్న ఓ ఇంటిపై పోలీసులు దాడిచేశారు. అక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దండు గోపాలకృష్ణంరాజును అరెస్టుచేసి, ఒక లైన్ బాక్స్, నగదు కౌటింగ్ మిషన్, రూ.9,55,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో రాజమహేంద్రవరం బెస్ట్‌ప్రైస్ ఎదురుగా ఉన్న శ్రీసాయి హెవెన్స్ అపార్ట్‌మెంట్ ప్లాట్ నంబర్ 504పై పోలీసులు దాడిచేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న కుప్ప ప్రవీణ్‌కుమార్ (సికింద్రాబాద్), మేకల కళ్యాణ్ (్భమవరం), ఎ జగదీష్‌ప్రసాద్ (్భమవరం), కలిదిండి శివధర్మతేజను అరెస్టుచేశారు. వారి నుండి 4లైన్ బాక్సులు, 124 సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు దాడుల్లో కలిపి మొత్తం ఏడుగురిని అరెస్టుచేసి, రూ.11లక్షల 26వేల 900 నగదు, 180 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. నిందితుల్లో కుప్ప ప్రవీణ్‌కుమార్ గత మూడు సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చిందన్నారు. వీరితో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టుచేయాల్సి ఉందని, వారు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. వారిని అరెస్టుచేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించామన్నారు. బెట్టింగ్ నిర్వహణ కోసం ఢిల్లీ, సోలాపూర్, రాజస్థాన్, ముంబాయ్, హైదరాబాద్‌లలో లభ్యమయ్యే ప్రత్యేక లైన్ బాక్సులను నిందితులు తీసుకువచ్చారన్నారు. ఒక్కొక్క లైన్ బాక్స్‌లో 20కు పైగా సెల్‌ఫోన్లు అనుసంధానమై ఉంటాయని, వాటితో దేశ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తారని తెలిపారు.

చిత్రం.. క్రికెట్ బెట్టింగ్ ముఠా వివరాలను తెలియజేస్తున్న ఎస్పీ విశాల్ గున్ని