క్రైమ్/లీగల్

రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఫిబ్రవరి 9: రైస్ పుల్లింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తు లక్షలు దోచుకుంటున్న మూఠాను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద రూ.7.90 లక్షల నగదు, 55 తులాల బంగారు అభరణాలు, ల్యాప్‌ట్యాప్, ఒక కారు, 11 సెల్‌ఫోన్‌లు, టెస్టింగ్ టూల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం... నేరేడ్‌మెట్ సైనిక్‌పూరి ప్రాంతానికీ చెందిన ప్రధాన నిందితుడు మధన్ మోక్షరాజు (37) జనపల్లి ఆదిశేషు (33) భువనగిరి జిల్లా, యాదాద్రి మండలం, ముటకొండూరు గ్రామానికీ చెందిన మదన్ బాలసుందర్ (38) బొంబాయికీ చెందిన గోపాల అనంత కృష్ణ, (55) భువనగిరి యాదాద్రి నగరానికీ చెందిన ఎండీ.అసీఫ్ సల్మాన్ (25) కుంతడి అమరేందర్ (29) విశాఖ పట్టణానికీ చెందిన పంగ రాజులు (22) ఒక మూఠాగా ఏర్పడి రైస్‌పుల్లింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి కోట్లు సంపాధించాలని పథకం వేశారు. ప్రధాన నిందితుడు మోక్షరాజు గతంలో ఇలాంటి కేసులలో పలు మోసాలకు పాల్పడుతే జైలుకు వెళ్లి వచ్చాడు. భువనగిరి ప్రాంతానికీ చెందిన మదిరెడ్డి భాస్కర్‌రెడ్డినీ భువనగిరిలోని హోటల్ వివేరాకు పిలిపించి రైస్ పుల్లింగ్ మిషన్ గురించి వివరించి అతన్ని నమ్మించారు. స్నేహితుడు పూర్ణచంద్రారెడ్డి వద్ద దైవ మహిమలు గల రైస్ పుల్లింగ్ మిషన్ ఉందని నమ్మించి దానియెక్క మహిమల గురించి చెప్పారు. మిషన్ ఖరీదు కోట్ల రూపాయలలో ఉంటుందని ముందుగా తమకు అడ్వాన్స్ ఇవ్వాలని భాస్కర్‌రావుకు చెప్పారు. వీరి మాయమాటలను నమ్మిన భాస్కర్ రావు అడ్వాన్స్‌గా రూ.41.85 లక్షల నగదను అందజేశారు. డబ్బులు తీసుకున్న నిందితులు రైస్ పుల్లింగ్ మిషన్‌ను భాస్కర్‌రావుకు అందజేశారు. ఇట్టి మిషన్‌ను రహస్యంగా దాచి పెట్టాలని సూచించడంతో భాస్కర్‌రావు తమ కోళ్ల ఫారం వద్ద ఉన్న గదిలో మిషన్‌ను దాచిపెట్టాడు. కొన్ని రోజులు గుడుస్తున్న తమ వద్ద డబ్బులు తీసుకున్న నిందితులు రాకపోవడంతో పాటు ఎలాంటి మాయలు చూపక పోవడంతో తానుమోస పోయానని గ్రహించిన భాస్కర్‌రావు వెంటనే భువనగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.