క్రైమ్/లీగల్

సినర్జీ లైఫ్ పేరుతో కుచ్చుటోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, ఫిబ్రవరి 12: పింఛన్, అధిక వడ్డీ ఆశగా చూపి అమాయక గ్రామీణ ప్రజల్ని నమ్మించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మూడు వందల మందిని బురిడీ కొట్టించిన వారిని జైలుకు తరలించారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన సెంథిల్ కుమార్, తులసి మండల కేంద్రంలోని సయ్యద్ అన్వర్ ఇంట్లో సినర్జీలైఫ్ పేరుతో నాలుగేళ్ల క్రితం కార్యాలయాన్ని ప్రారంభించారు. తమవద్ద రికరింగ్ డిపాజిట్‌గా రూ. లక్ష జమచేసిన వారికి ప్రతినెలా పింఛన్‌గా రెండువేలు ఇస్తామని, కాలపరిమితి ముగిశాక అధిక వడ్డీతో పెట్టుబడిపై లాభం ఇస్తామని నమ్మించారు. మహేశ్వరం, కందుకూర్, కేశంపేట్‌తోపాటు పలు ప్రాంతాలలో ప్రచారం చేసి రూ.కోటికి పైగా వసూలు చేశారు. డిపాజిట్లు కాలపరిమితి ముగిసే సమయం రావడంతో కంపెనీని ఎత్తివేశారని మహేశ్వరం ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో ముగ్గురిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
బాలాపూర్, ఫివ్రబరి 12: గుట్టు చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం చేస్తున్న స్థావరంపై మంగళవారం ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి, నిర్వాహకులతో పాటు గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్న సంఘటన మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోటీసులు తెలిపిన వివరాల మేరకు.. బడంగ్‌పేట్ శివనారాయణపురంలో నివాసం ఉండే టీ.శ్రావణ్ కుమార్(30), టీ.హరిప్రసాద్(35) గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు శివనారాయణపురంలో గుట్కా స్థావరంపై దాడి చేసి, గుట్కా ప్యాకెట్లతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గోదాంలో దాదాపు రూ.10 లక్షలు విలువగల గుట్కా ప్యాకెట్లను నిర్వాహకులను మీర్‌పేట్ పోలీసులకు అప్పగించారు.
చరికొండలో చిరుత సంచారం
ఆమనగల్లు, ఫిబ్రవరి 12: కడ్తాల చరికొండ పల్లెచెల్క అడవుల్లో చిరుత పులి సంచరిస్తుండటంతో కాపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి ఎప్పుడు వచ్చి తమ గొర్రెలను, ఆవుదూడలను తింటుందోనని రైతులు అంటున్నారు. ఇటీవల రైతులు, కాపరులకు చెందిన బర్రెదూడ, గొర్రెలను ఎత్తుకెళ్లిందని వారు తెలిపారు. ఈ విషయమై కందుకూరు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని చిరుతను పట్టుకునేందుకు బోనులు ఎర్పాటు చేసినా ప్రయోజనం లేదని వారు అంటున్నారు. తమ మూగజీవాలను పొట్టన పెట్టుకుంటున్న చిరుతను బంధించి ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని సర్పంచ్ లాల్‌కోట నర్సింహ భారతమ్మ కోరారు.