క్రైమ్/లీగల్

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 12: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తొమ్మిదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి మంగళవారం తీర్పు ఇచ్చారు. చల్లపల్లి మండలం రామానగరం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన మట్టా దిలీప్ కుమార్ (23) పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంటి వద్దనే తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. దిలీప్ చిన్న తనంలోనే తల్లి మృతి చెందగా తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు. 2017 జనవరి 11వ తేదీన దిలీప్ కుమార్ తన మేనత్త ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన చల్లపల్లి పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసును హత్య కేసుగా మార్చి విచారణ నిర్వహించారు. మృతుడు దిలీప్ కుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడైన పెనుమాక దుర్గా ప్రసాద్ (27) భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గతంలో కూడా ఒకసారి గ్రామ పెద్దలతో వచ్చి బెదిరించి ఎప్పటికైనా చంపుతానని బెదిరించాడు. ఈ క్రమంలో 2017 జనవరి 11వతేదీన దిలీప్ కుమార్ తన మేనత్త ఇంటి వద్ద ఓ శుభకార్యానికి హాజరై ముందు రోజు రాత్రంతా అక్కడే సపర్యలు చేశాడు. 11వతేదీ మధ్యాహ్నం 12గంటల సమయంలో శుభకార్యంలో పాల్గొనడానికి తయారై వస్తానని చెప్పి మేనత్త ఇంటి ఇంటికి వెళ్లాడు. ఎంత సేపటికీ దిలీప్ రాకపోయే సరికి అతని తండ్రి మట్టా వెంకయ్య దిలీప్ మేనత్త ఇంటికి వెళ్ల అప్పటికే దుర్గా ప్రసాద్ మరో వ్యక్తి గోపిచంద్‌లు హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. ఇంట్లో చూడగా దిలీప్ ఉరి పోసుకుని మృతి చెంది ఉన్నాడు. తండ్రి వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కేసులో దుర్గా ప్రసాద్, గోపిచంద్‌లను నేరస్తులుగా గుర్తించి అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పైన తెలిపిన ఇరువురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.