క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాడంగి, ఫిబ్రవరి 14: మండలం కోటిపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి ఏఎస్‌ఐ కొండలరావు అందించిన వివరాల ప్రకారం మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన పడాల గంగులు(45) గురువారం ఉదయం పొలానికి వెళ్లి సైకిల్‌పై తిరిగి వస్తుండగా కుక్కలు అడ్డురావడంతో కింద పడిపోయాడు.దీంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు 108వాహనంలో సిహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడన్నారు. భార్య సత్తెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. గంగులు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.