క్రైమ్/లీగల్

పంచాయతీరాజ్ ఇంజనీర్ బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 14: ప్రకాశం జిల్లా పొదిలిలో పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న పగడాల రవిప్రకాష్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో గురువారం ఏకకాలంలో ఒంగోలు, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాలలోని రవిప్రకాష్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతినిరోధక శాఖ డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ తనిఖీలలో భాగంగా జరిగిన సోదాలలో ఒంగోలు గోవిందనగర్‌లోని రవిప్రకాష్ ఇంట్లో 1.25లక్షల నగదు, 1.25కోట్ల రూపాయల విలువచేసే 14ప్లాట్లకు సంబంధించిన పత్రాలు, వివిధ చిట్‌ఫండ్లు, ఎల్‌ఐసీ బాండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో వీటి విలువ 3.5కోట్ల వరకు ఉండవచ్చని చెప్పారు. రవిప్రకాష్‌పై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.