క్రైమ్/లీగల్

ఉద్యోగానే్వషణలో ఆఖరి పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14: పోలీసు ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల జరిగిన పోలీస్ ఉద్యోగాల నియామక ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. పరుగు పందెంతో పాటు దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో వేగంగా పరిగెడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ఆఖరి పరుగుతో గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటనతో ఓ నిరుపేద కుటుంబంలో తీరని విషాదం మిగలగా, ఉన్నతాశయంతో పోలీసు ఉద్యోగ సాధనే లక్ష్యంగా సిద్ధమయిన యువకుడు ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఎలిమినేడు అనుబంధ గ్రామం మేటిల్లకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేసి పదవీవిరమణ పొందిన యాదయ్య, నాగలక్ష్మి కుమారుడు ఏకాంబరం(23) డిగ్రీ విద్యనభ్యసించి పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నాడు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు నియామకాల రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఈనెల 23న దేహధారుఢ్య పరీక్షలు ఉండడంతో ఎలిమినేడు నుంచి వచ్చి ఇబ్రహీంపట్నంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి హాజరవుతున్నాడు. గురువారం ఉదయం ఎనిమిది వందల మీటర్ల పరుగుకు సిద్ధమయ్యాడు. పరుగు పెడుతూనే ప్రారంభించిన కొద్దిసేపటికే కుప్పకూలాడు. మిగతా అభ్యర్థులు తేరుకొని ఏకాంబరాన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. పరుగులో గుండెపోటు రావడంతోనే ఏకాంబరం మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఏకాంబరం మరణవార్త తెలిసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం సీఐ గురువా రెడ్డి పేర్కొన్నారు.