క్రైమ్/లీగల్

బదిలీ బాధ్యత గవర్నర్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఢిల్లీ ప్రభుత్వ అధికారాల వికేంద్రీకరణ, పంపిణీ అంశంపై విచారణ చేపట్టే బాధ్యతను విస్తృత రాజ్యాం గ ధర్మాసనానికి నివేదిస్తూ, సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించి కాగా కొన్ని అంశాలపై అధికారాలను పంపిణీ చేస్తున్నట్లు కోర్టు తీర్పులో పేర్కొంది. అవినీతి నిరోధక శాఖ, కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు, విద్యుత్ బోర్డులపై నియంత్రణ, భూమి శిస్తు, ప్రాసిక్యూటర్ నియామకాలపై కోర్టు స్పష్టత ఇచ్చింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులను రాష్ట్రప్రభుత్వం పరిధిలోని ఏసీబీ దర్యాప్తు చేయడానికివీలులేదన్న కేంద్రం అభిప్రాయం, నోటిఫికేషన్‌తో కోర్టు ఏకీభవించింది. కాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్లు కాకుండా, రాష్ట్రప్రభుత్వానికి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వమే భూమి శిస్తును నిర్ణయిస్తుందని కోర్టు పేర్కొంది. ఎంక్వైరీ కమిషన్లను ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని కోర్టు తీర్పులో తెలిపింది. ఎలక్ట్రిసిటీ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ఢిల్లీ సర్కార్‌కు ఉంటుంది. జాతీయ రాజధానిలో సర్వీసుల నియంత్రణ అధికారంపై ధర్మాసనం తీర్పును వాయిదావేసింది. సాఫీగా పాలన సాగించేందుకు కార్యదర్శులు, హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ల బదిలీలు చేసరే అధికారం కేంద్రం చేతిలోనే ఉంటాయి. పారదర్శకత కోసం 3,4 కేడర్ల అధికారుల సర్వీసులు, బదిలీల కోసం బోర్డు ఏర్పాటు చేయాలని, అదే తరహాలో ఐఎఎస్‌లకోసం మరో బోర్డును నెలకొల్పాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు తీర్పు అప్రజాస్వామికం
* ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ పరిధిలో విధులు, అధికారాలపై నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పరిష్కారాలు కావాలని కోర్టును కోరనున్నట్లు ఆయన చెప్పారు. ఆప్ ప్రభుత్వం పనిచేయకుండా కేంద్రం రకరకాల సమస్యలను సృష్టిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏడు లోక్‌సభ సీట్లలో తమ పార్టీ పోటీచేస్తుందన్నారు.
ఢిల్లీ ప్రజలకు కోర్టు అన్యాయం చేసిందన్నారు. ఢిల్లీ ఓటర్లు మాకు 67 సీట్లు ఇచ్చారన్నారు. ఆఫీసర్లను బదిలీ చేసే అధికారం ఇవ్వకపోతే ప్రభుత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అన్ని సీట్లలో ఆప్ పార్టీని గెలపిపించాలని ఆయన కోరారు.

చిత్రాలు.. సుప్రీంకోర్టు * మీడియాతో మాట్లాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్