క్రైమ్/లీగల్

కపిల్ సిబల్‌పై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి పలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్, సయ్యద్ సుజా అనే సైబర్ నిపుణుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసు కమిషనర్ ఆదేశాలతో నారాయణగూడ పోలీసు స్టేషన్‌లో వారిద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని బీజేపీ ఎంఎల్‌సీ ఎన్ రామచందర్‌రావు తెలిపారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారని గురువారం నాడు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను రామచందర్‌రావు వివరించారు. 2014లో జరిగిన లోక్‌సభ జనరల్ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేయడం ద్వారా రిగ్గింగ్ చేసి అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి వచ్చిందని, ఈవీఎంల హ్యాకింగ్ సహకరించిన 14 మంది సైబర్ నిపుణులను బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తన బావమరిదికి చెందిన ఉప్పల్ గెస్టు హౌస్‌కు పిలిపించి సామూహిక హత్యలకు పాల్పడ్డారని సయ్యద్ సుజా ఆరోపించారని అన్నారు. ఆ సంఘటన నుండి తుపాకీ గాయంతో తప్పించుకుని అమెరికాకు వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నట్టు చెప్పుకున్న సయ్యద్ సుజా కాలిఫోర్నియా నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా లండన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కపిల్ సిబాల్ సమక్షంలో ఈ విషయాలు చెప్పారని, 11 మంది సైబర్ నిపుణుల హత్యలు, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు బాధ్యుడైన కిషన్‌రెడ్డిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారని, ఆ ప్రకటన తర్వాత వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రాహుల్‌గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతాబెనర్జీ, చంద్రబాబునాయుడు లాంటి వారు ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దేశ ప్రధాని నరేంద్రమోదీపై బురదజల్లే ప్రయత్నం చేశారని, దేశ ప్రజల్లో బీజేపీపై దురభిప్రాయం కలిగించేలా సయ్యద్ సుజా, కపిల్ సిబాల్‌లు వ్యవహరించారని రామచందర్‌రావు ఆరోపించారు. ఈ అంశంపై కిషన్‌రెడ్డి 15వ తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించనున్నారని ఆయన వెల్లడించారు.