క్రైమ్/లీగల్

ఈతకోట ప్రత్యేక చెక్‌పోస్టు వద్ద రూ.30 లక్షల నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, ఫిబ్రవరి 19: ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును రావులపాలెం పోలీసులు సోమవారం సీజ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఈతకోట వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం చెక్‌పోస్టు వద్ద ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట నుండి పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి వెడుతున్న ఒక కారును తనిఖీ చేయగా ఆ కారులో 30 లక్షలు నగదు ఉన్నట్టు గుర్తించారు. దీంతో కారులో ఉన్న అత్తిలికి చెందిన ఈర్రి సుబ్రహ్మణ్యంను ఎస్సై ప్రశ్నించగా తాను ధాన్యం కమిషన్ ఏజెంటునని, నగదు రైతులకు సంబంధించినదని చెప్పారు. అయితే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదు సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్సై విద్యాసాగర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రెండు లక్షలకు మించి నగదు తరలించే వారు తగిన ఆధారాలు చూపాలని ఆయన సూచించారు. ఈ తనిఖీల్లో ఎఎస్సై ఆర్‌వి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.