క్రైమ్/లీగల్

వ్యాపారికి టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 18: గుజరాత్‌కు చెందిన జ్యూవేలరీ వ్యాపారిని మోసగించిన ముగ్గురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్. శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన జునైద్ వ్యాపారి. తన వద్ద ఉన్న ఎమ్రాల్డ్ గ్రీన్ స్టోన్‌ను విక్రయించాలని నిర్ణయించాడు. 111 క్యారెట్ల కలిగిన స్టోన్ బోక్రర్ ప్రకాష్ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించారు. ప్రకాష్ హైదరాబాద్‌కు చెందిన నర్సింహారావు, సురేష్‌కుమార్ పరిచయం చేశారు. పథకం ప్రకారం... నాణ్యతను పరీక్షించాలని చెప్పి బంజారాహిల్స్ రోడ్‌నెంబర్8లోని గోల్కొండ ఇన్సిటిట్యూట్ ఆఫ్ డైమండ్స్ ల్యాబ్‌కు వద్దకు చేరుకున్నారు. స్టోన్ పరీక్షల కోసం లోనికి తీసుకువెళ్లి నర్సింహా రావు, సురేష్ వారిలో వారే ఘర్షణ పడ్డట్టు నటించి స్టోన్ తీసుకొని పారిపోయారు. కొద్దిసేపటి అనంతరం తేరుకున్న జునైద్ తాను మోస పోయానని గ్రహించి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరిగుతున్న సురేష్, నర్సింహా రావులను అదుపులోనికి తీసుకునేందుకు ప్రయత్నించగా గన్‌తో బెదిరించారు. అలర్ట్ ఎస్‌ఐ.రామిరెడ్డి చాకచక్యంగా నారాయణను అరెస్టు చేశారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా తాము చేసిన చోరీల చిట్టా విప్పారు. వీరికి సహకరించిన రాంబాబుతో పాటు వీరి వద్ద నుంచి ఖరీదైన స్టోన్, ఓ కారు, కంట్రీమెడ్ గన్, పది బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.