క్రైమ్/లీగల్

చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 18: చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.21 లక్షల జరిమానా విధిస్తూ మేడ్చల్ 22వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి నాగరాజు సోమవారం తీర్పును వెల్లడించారు. 2010 సంవత్సరంలో అల్వాల్ ప్రాంతానికి చెందిన సురేశ్‌గిర్ అనే వ్యక్తి దూలపల్లి మాజీ సర్పంచ్, వైశ్య సంఘం నేత చంద్రమాణిక్యానికి రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చాడు. రెండు సంవత్సరాల పాటు రూ. 21 లక్షలకు వడ్డీ చెల్లించిన చంద్రమాణిక్యం ఆ తర్వాత అసలు నగదుకు సంబంధించిన చెక్కును సురేశ్‌గిర్‌కి ఇచ్చాడు. సురేశ్‌గిర్ చెక్కును బ్యాంక్‌లో జమా చేయగా అదికాస్త చెల్లకుండా పోయింది. సురేశ్‌గిర్ 2013 సంవత్సరంలో కోర్టును ఆశ్రయించాడు. ఆరు సంవత్సరాల పాటు వాదోపవాదాలు జరిపిన న్యాయమూర్తి.. సోమవారం చంద్రమాణిక్యానికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.21 లక్షలకు అదనంగా మరో రూ.21 లక్షలు (జరిమానా రూపంలో) కలిపి మొత్తం రూ.42 లక్షలు చెల్లించాలని తుది తీర్పును వెల్లడించారని న్యాయవాదులు కృష్ణ, సంతోష్ పేర్కొన్నారు.