క్రైమ్/లీగల్

‘ఫెరా’ కేసులో దినకరన్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్‌పై విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) కింద ఈడీ నమోదు చేసిన కేసుకు సంబంధించి చెన్నై కోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీం కోర్టు సోమవారం స్టే మంజూరు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలు దినకరన్‌కు ఇవ్వాల్సిందిగా మద్రాసు హైకోర్టు గత జూన్ 25న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం టీటీవీ దినకరన్‌కు ఈ సందర్భంగా నోటీసులు జారీ చేసింది. దాదాపు ఒక కోటి నాలుగు లక్షల తొంభై మూడు వేల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా దినకరన్ సమీకరించి ఆ మొత్తాన్ని బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్‌లోని డిప్పర్ ఇనె్వస్ట్‌మెంట్స్ ఇండియా ఖాతాలోకి డిపాజిట్ చేశాడని, అలాగే యూకేలోని బార్సిలోనా బ్యాంకులో ఖాతా కలిగివున్నాడని ప్రధాన అభియోగాలు.