క్రైమ్/లీగల్

ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, ఫిబ్రవరి 18: ఒక తల్లి తన ఇద్దరు కుమార్తెలను పీక నులిమి హత్యచేసి, ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో సోమవారం రాత్రి వెలుగుచూసింది. మృతురాలి భర్త తన భార్య ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో తెలియడంలేదని చెబుతుంతగా, తమ అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడివుంటాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... పిట్టల వేమవరం గ్రామానికి చెందిన నల్లిమిల్లి వెంకట రామాంజనేయ రెడ్డి, లక్ష్మీప్రసన్న దంపతులు గత కొంతకాలంగా మొగల్తూరు గ్రామంలోని చేపల మార్కెట్ వీధిలో నివసిస్తున్నారు. వీరికి రోజా శ్రీలక్ష్మి (8), జాహ్నిక (5) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. రామాంజనేయ రెడ్డి గ్రామంలో రైసుమిల్లు నిర్వహిస్తుంటాడు. రామాంజనేయరెడ్డి తండ్రి సత్యనారాయణ రెడ్డి మూడు మాసాల క్రితం మృతిచెందగా, తల్లి రామలక్ష్మి ఇటీవలే మృతిచెందింది. ఆమె దశదిన కార్యక్రమం ఆదివారం పూర్తికాగా, సోమవారం ఇంట్లో శాంతి పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల సమయంలో రామాంజనేయరెడ్డి రైసు మిల్లుకు వెళ్లి, 7 గంటల సమయంలో ఇంటికి తిరిగివచ్చాడు. ఇంట్లోకి వెళ్లేసరికి భార్య లక్ష్మీప్రసన్న (28) ఫ్యానుకు ఉరివేసుకుని, కుమార్తెలు విగతజీవులై మంచంపై పడివుండటాన్ని చూసి నివ్వెరపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తమకు కుటుంబ సమస్యలేమీ లేవని, తన భార్య ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడంలేదని రామాంజనేయ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే తమ అల్లుడు రామాంజనేయ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడి, ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడని మృతురాలు లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు కర్రి సత్యనారాయణ రెడ్డి, కనకదుర్గ ఆరోపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరుకు చెందిన తమ కుమార్తె లక్ష్మీ ప్రసన్నను రామాంజయనేయ రెడ్డికి ఇచ్చి 2011లో వివాహం చేశామని తెలిపారు. అప్పటి నుండీ రామాంజనేయ రెడ్డి తమ కుమార్తెను వేధించేవాడన్నారు. రైసు మిల్లుకు రూ.3.4 కోట్లు అప్పులున్నాయని చెప్పడంతో తాము ఇటీవలే రూ.75 లక్షలు ఇచ్చామని, అయినా ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అల్లుడే తమ కుమార్తె, మనుమరాళ్లను చంపి నాటకమాడుతున్నారని, అతటిని పూర్తిగా విచారించి, కఠినంగా శిక్షించాలని కోరారు. నరసాపురం డీఎస్పీ కె నాగేశ్వరరావు, సీఐ కృష్ణకుమార్ సంఘటనాస్థలాన్ని సందర్శించారు. మొగల్తూరు ఎస్సై మదీనా బాషా కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.