క్రైమ్/లీగల్

డిపో మేనేజర్ కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఫిబ్రవరి 19: పాడేరు ఆర్.టి.సి. డిపో మేనేజర్ రమేష్ కారును గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్థరాత్రి దగ్ధం చేసారు. స్థానిక స్టేట్ బ్యాంకు ఎదురుగా ఐ.టి.డి.ఎ. నూతనంగా నిర్మించిన క్వార్టర్లలో నివాసం ఉంటున్న డిపో మేనేజర్ తన కారును ఎప్పటివలే ఆరు బయట ఉంచడంతో సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో కారు దగ్ధవౌతున్న విషయాన్ని కొందరు గుర్తించారు. దీంతో డిపో మేనేజర్‌కు ఈ విషయమై తెలియచేసి అప్రమత్తం చేసారు. అయితే అప్పటికే కారు సగ భాగం మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. డిపో మేనేజర్ ఇచ్చిన పిర్యాదు మేరకు పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.