క్రైమ్/లీగల్

లారీ డీకొని సైకిస్టు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 19:స్థానిక పూడిమడకరోడ్డుజెఎంజె స్కూల్ సమీపంలోమంగళవారం ఉదయం సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుకనుండి టిపర్‌లారీ డీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు. ట్రాఫిక్ ఎస్‌ఐ సోమునాయుడు అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మునగపాగ మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన గండి నూకరాజు(45) రోజుమాదిరిగా కూలిపని కోసం నాగులాపల్లి నుండి అనకాపల్లివైపు సైకిల్‌పై వస్తుండగా వెనుక నుండి టిప్పర్‌లారీ బలంగా డీకొట్టిందన్నారు. నూకరాజు తలకు తీవ్రగాయం కావడంతో ఎన్టీఆర్ ఆసుపత్రికి చికిత్సకోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మృతి బందువులు సంఘటనాస్థలానికి చెరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో ఆ మార్గంలోరెండుగంటలుపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మేరకు ట్రాఫిక్ ఎస్‌ఐ స్వామినాయుడు అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను సరిచేసారు.కేసునమోదుచేసి నట్లుగాఆయన తెలిపారు.