క్రైమ్/లీగల్

ఈడీ విచారణకు రాబర్డ్ వాద్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: మనీ లాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎఐసీసీ అధ్యక్షుడురాహుల్ గాంధీ బావ రాబర్డ్ వాద్రా శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. దేశవిదేశాల్లో అక్రమంగా ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన కేసులో రాబర్డ్ వాద్రాపై ఆరోపణలున్న విషయం విదితమే. ఈడీ ఆఫీసుకు వాద్రా హాజరు కావడం ఇది ఐదోసారి. సెంట్రల్ ఢిల్లీలోనీ ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు వాద్రా వచ్చారు. ఈ నెల 20వ తేదీన కూడా వాద్రా ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా అభియోగాలపై వాద్రా వాంగ్మూలాన్ని ఈడీ పోలీసులు నమోదు చేశారు. గతంలో ఈడీ విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినప్పుడు ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు వాద్రా చెప్పారు. ఇంతవరకు వాద్రాను నాలుగుదఫాల విచారణలో 26 గంటల సేపు ఈడీ అధికారులు ప్రశ్నించారు. లండన్‌లో 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తుల కొనుగోలు, బినామీ కోనుగోళ్లు, మనీ లాండరింగ్ కేసుల్లో రాబర్డ్ వాద్రా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. తనకు విదేశాల్లో ఎటువంటి స్థిరాస్తులు లేవని, మనీ లాండరింగ్‌కుపాల్పడినట్లు వచ్చిన అభియోగాల్లో నిజం లేదని ఆయన ఈడీ అధికారులకు చెప్పారు.
తనను అదికారులు అనవసరంగా వేధిస్తున్నారని వాద్రా ఇప్పటికే చెప్పారు. జైపూర్‌లోని ఈడీ అధికారుల విచారణకు కూడా వాద్రా హాజరై అభియోగాలకు బదులిచ్చారు. ఈ కేసుల్లో వాద్రా తల్లి మరిన్‌ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు.