క్రైమ్/లీగల్

వీరు మాకు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: జమ్మూ జైలులో శిక్షను అనుభవిస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులను తక్షణం ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించాలని జమ్మూ- కాశ్మీర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈనెల 14న పుల్వామాలో పాక్ ముష్కరులు 41 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న నేపథ్యంలో వారి ప్రభావం ఇక్కడ ఉన్న ఖైదీలపై పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ ఏడుగురు పాక్ ఖైదీలను వెంటనే ఇక్కడ నుంచి తీహార్ జైలుకు మార్చిలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వాక్వాస్ మంజూర్ అలియాస్ క్వాజిర్, మహమ్మద్ అబ్దుల్లా అలియాస్ అబూ తలాహ్, జాఫర్ ఇక్బాల్ (లష్కరే తోయిబా), జుబైర్ తల్హా జరోర్ అలియాస్ తల్హా (లష్కరే తోయిబా) అనే పాక్‌లోని ముల్తాన్‌కు చెందిన ఈ వ్యక్తులు 2013లో అరెస్టు అయ్యారు. అదేవిధంగా మహమ్మద్ అలీ హుస్సే న్ (లష్కరే తోయిబా)ను 2014లో అరస్టు చేశారు. హఫీజ్ అహమ్మద్ బలోచ్ అనే ఆల్‌బదర్ ఉగ్రవాద గ్రూపునకు చెంది న వ్యక్తిని 2006లో అరెస్టు చేశారు. దక్షిణ కాశ్మీర్‌లోని సోఫియానా జిల్లా, నదిమార్గ్ ఏరియాకు చెందిన 23 మంది కాశ్మీరీ పండిట్‌లను హతమార్చిన జియా ముస్త్ఫా అనే నిందితుడిని 2003లో అరెస్టు చేశారు. దీనిపై జస్టిస్ ఎల్.ఎన్.రావు, ఎం.ఆర్.షాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ విజ్ఞప్తిని పరిశీలించి తగిన వివరణ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఆదేశించింది. ఏడుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఢిల్లీలోని తీహార్ జైలుకు గానీ హర్యానా, పంజాబ్‌లోని జైళ్లకైనా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ షోయబ్ ఆలమ్ సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.