క్రైమ్/లీగల్

సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 23: ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మావోయిస్టు చర్యలు అధికంగా జరుగుతుండటం, ఎన్నికల వేళ మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడతారనే సమాచారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారులు ప్రత్యేకంగా వ్యూహరచన చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు శనివారం పోలవరంలో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు, మద్యం సరఫరా చేసే వారిని అడ్డుకునేందుకు సరిహద్దులో చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టపర్చడంతో పాటు అదనపు పోలీస్ బలగాలను రప్పించాలని నిర్ణయించారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోగా మరో సమావేశం నిర్వహించాలని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి అక్రమాలు జరగకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. తరువాతి సమావేశం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని అనుకున్నట్లు తెలిసింది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఇటీవల మావోయిస్టులు పలు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఈ ఎన్నికల సమయంలో అవి జరగకుండా ఉండేందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలనుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం, విశాఖ, ములుగు జిల్లాల పరిధిలో అదనపు బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.