క్రైమ్/లీగల్

చైన్ స్నాచర్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, మార్చి, 3: రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు వివిధ ప్రాంతాలల్లో ఒంటరిగా తిరుగుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలోని బంగారు గొలుసులను అపహరించి సొమ్ము చేసుకుంటున్న దొంగను ఎట్టకేలకు ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలను డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. జీడిమెట్ల- సురారంలో నివాసం వుండే కావాలి శ్రీనివాస్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రీషియన్ పని చేస్తుండేవాడు. వినియోగదారుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండడం ద్వారా పలువురు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు శ్రీనివాస్‌ను పని నుంచి తొలగించారు. శ్రీనివాస్ అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతూ వుండేవాడు. చేవెళ్లలోని ఒక హోటల్‌లో పేపర్‌లో ఉన్న వార్తను చదివాడు. ఆ వార్తే అతని పాలిట శాపంగా మారింది. ఆ దినపత్రికలో చైన్ స్నాచింగ్‌కు సంబంధించిన వార్తను చదివినట్లు తెలిపారు. షాపింగ్, దేవాలయాలకు, పాఠశాలలకు వెళ్లి వచ్చే మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలో వున్న బంగారాన్ని లాక్కొని బైక్‌పై వెళ్లేవాడని, చోరీ చేసిన బంగారాన్ని అమ్మకుండా మార్వాడి షాపులో తాకట్టుపెట్టి డబ్బులు తీసుకునేవాడు. వరుస చోరీలు జరగడంతో సవాలుగా తీసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి బంగారంతో పాటు, బైక్, అతను తాకట్టు పెట్టిన నాలుగు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకొని శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు.