క్రైమ్/లీగల్

ఓట్ల తొలగింపులో 33 మందిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, మార్చి 4 : సంచలనం సృష్టించిన ఓట్ల తొలగింపు ప్రక్రియ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలాన్ని తాకింది. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన ఓట్లను తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చిన ఆరోపణలపై రెవెన్యూ శాఖ లోతుగా విచారణ చేపట్టింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వివిధ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఓటర్లకు తెలియకుండా వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలంటూ ఆన్‌లైన్లో దరఖాస్తు చేసిన 33 మందిపై స్థానిక తహశీల్దార్ జి అనిల్‌కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ కారణాలు చూపుతూ 1709 మంది ఓట్లను తొలగించాలంటూ 33 మంది ఫారం 7లను ఆన్‌లైన్లో దాఖలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.