క్రైమ్/లీగల్

గాంధీ హత్య కేసుపై మళ్లీ దర్యాప్తు విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: మహాత్మాగాంధీ హత్య కేసుపై మళ్లీ దర్యాప్తు చేయాలని వచ్చిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పూజ్య బాపూజీ హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీనిపై మళ్లీ దర్యాప్తు చేపట్టాలని ముంబయికి చెందిన పంకజ్ ఫడ్నిస్ అనే పరిశోధకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే, ఎల్.ఎన్.రావుతో కూడిన బెంచ్ మహాత్మాగాంధీ హత్య కేసుపై మళ్లీ దర్యాప్తు చేపట్టేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ‘్ఫర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్‌ను సమగ్రంగా పరిశీలించాం. బాపూజీ హత్య వెనుక ఎలాంటి కుట్ర దాగి లేదని భావిస్తున్నాం. అందువల్లే దీనిని తోసిపుచ్చుతున్నాం’ అని సుప్రీం డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ హత్యకు సంబంధించిన పలు పుస్తకాలు, ఫోరెన్సిక్ రిపోర్టు, వివిధ ఫొటోలతో కూడిన అంశాలను ఫిర్యాదుదారు కోర్టు దృష్టికి తీసుకెళ్లి, మళ్లీ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఇదిలావుండగా, గాంధీ హత్యోదంతంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని 2018 మార్చిలో ఒక పిటిషన్ దాఖలు కాగా, దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.