క్రైమ్/లీగల్

ఆ వీడియో లింక్‌లను తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: యోగా గురు రామ్‌దేవ్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్న వీడియో లింక్‌లను తక్షణం తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఫేస్‌బుక్ యాజమాన్యాన్ని ఆదేశించింది. రామ్‌దేవ్‌తోపాటు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌పై వివిధ అంశాలతో కూడిన పనికిమాలిన, చౌకబారు ఆరోపణలు, బెదిరింపులతో కూడిన వీడియోలను వెంటనే గూగుల్, యూట్యూబ్‌ల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. ‘యోగా గురుపై వచ్చిన వీడియోలను పూర్తిగా పరిశీలించాం. గూగుల్, యూట్యూబ్ నిబంధనలను ఉల్లంఘించాయని గుర్తించాం. అలాంటి వీడియోలు ఎప్పుడూ కనిపించడానికి వీల్లేదు’ అని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ స్పష్టం చేశారు. ఆ వీడియోలను అప్‌లోడ్ చేసే ముందు బాధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ వీడియోలను కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ లింక్‌లు వ్యాప్తి కాకుండా గూగుల్, యూట్యూబ్ యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తన పరువు, ప్రతిష్టలను దెబ్బతీస్తూ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించాలని యోగా గురు రామ్‌దేవ్ హైకోర్టులో దావా వేశారు. దీనిపై ఈ ఏడాది జనవరి 24న ఢిల్లీ హైకోర్టు ఫేస్‌బుక్, గూగుల్, యూట్యూబ్‌లకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.