క్రైమ్/లీగల్

రెండు లారీలు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లజర్ల, మార్చి 4 : పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద సోమవారం తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మంటలు చెలరేగి, ఒక లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. నల్లజర్ల పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన సవరపు హరీష్ (25) క్వారీ టిప్పర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున గౌరీపట్నం నుంచి భీమడోలు వైపు టిప్పరుతో వెళ్తుండగా దూబచర్ల సమీపంలో ఎదురుగా వస్తున్న టైల్స్ లారీ ఎదురుగా ఢీకొంది. టిప్పరు లారీ టైల్స్ లారీ డీజిల్ ట్యాంకును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, రెండు లారీలు దగ్ధమయ్యాయి. టిప్పరు లారీలో ఉన్న హరీష్ సజీవ దహనమయ్యాడు. టైల్స్ లారీ డ్రైవర్ కృష్ణా జిల్లా వీళ్ళపాడు మండలం వెల్లంకి గ్రామానికి చెందిన యరమరెడ్డి సాంబశివరావు, క్లీనర్ షేక్ నాగూర్ మీరా అప్రమత్తమై లారీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. సజీవ దహనమైన హరీష్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ పి.శ్రీను సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. నల్లజర్ల ఎస్సై వి.సుబ్రహ్మణ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం.. లారీలో సజీవ దహనమైన డ్రైవర్ హరీష్