క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, మార్చి 5: బుక్కరాయసముద్రం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో మంగళవారం పురుగుల మందు తాగి వ్యక్తిఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. బుక్కరాయసముద్రం పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. చెన్నంపల్లి గ్రామం హరిజనవాడకు చెందిన దాసరి సురేంద్ర (25) కుటుంబ సమస్యలతో మనస్థాపనకు గురై మద్యంలో పురుగుల మందు కలుపుకొని గ్రామ చివరలో తాగి పడి వుండగా అక్కడ తిరుగుతున్న స్థానికులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలంకు వెళ్లేటప్పటికే అపస్మారక స్థితిలో పడివున్న సురేంద్రను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.